సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చిన్న సినిమాలు కూడా ఓ రేంజిలో భారీ విజయాలు సాధిస్తాయి. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఎవ్వరికి తెలీకుండా వచ్చి మరీ భారీ హిట్స్ కొడతాయి కొన్ని చిన్న సినిమాలు.ఇక అన్ని పరిశ్రమలలో ఇలా అద్భుతం జరుగుతుంది. ఈమధ్య తమిళ్ లో లవ్ టుడే అనే సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్, ఇవానా జంటగా రాధికా, యోగిబాబు ఇంకా అలాగే సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. హీరోగా నటించిన ప్రదీప్ ఈ సినిమాని దర్శకుడిగా కూడా తానే తెరకెక్కించాడు.కేవలం 5 కోట్ల చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన లవ్ టుడే సినిమా మొదట తమిళ్ లో విడుదలయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రేమించిన అమ్మాయి, అబ్బాయి పెళ్ళి చేసుకోవాలంటే ఒకరి ఫోన్ ఒకరు మార్చుకొని వాడాలి అనే ఓ కొత్త ట్రెండీ కాన్సెప్ట్ తో కామెడీ, ఎమోషన్స్ తో ప్రేక్షకులని ఈ సినిమా ఎంతగానో మెప్పించింది.


ముఖ్యంగా యూత్ కి అయితే ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా తర్వాత ప్రదీప్ ఇంకా ఇవానా ఓవర్ నైట్ పెద్ద స్టార్స్ అయిపోయారు. తమిళ్ లో హిట్ అయిన తర్వాత ఈ సినిమాని తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేశారు. ఆ తరువాత వేరే రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రిలీజయింది. 5 కోట్లతో తెరకెక్కిన లవ్ టుడే సినిమా ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి ఊహించని ప్రాఫిట్స్ ని సాధించి అందరిని ఎంతగానో ఆశ్చర్యపరిచింది.ఇక తాజాగా  లవ్ టుడే సినిమా ఏకంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజులకు కూడా లవ్ టుడే సినిమా తమిళనాడులోని కొన్ని సెంటర్స్ లో ఇంకా విజయవంతంగా ఆడుతుండటం విశేషం. ఈ సినిమాతో దర్శకుడిగా ప్రదీప్ కి చాలా అవకాశాలు వస్తున్నాయి. ఇక హీరోయిన్ ఇవానాకు కూడా వరుసగా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. మొత్తానికి చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టి ఏకంగా 100 రోజుల సెలబ్రేషన్స్ చేసుకుంది లవ్ టుడే.

మరింత సమాచారం తెలుసుకోండి: