రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దీంతో అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిపోయింది అని అటు వైపు బాలయ్య మరియు నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ను కూడా కంప్లీట్ చేసుకుంది.
అందుకే ప్రెసెంట్ ఓటిటీలో విడుదల అయ్యేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఐతే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ గురించి ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి దాంట్లో భాగంగానే తాజాగా మేకర్స్ నే అఫిషియల్ గా ప్రకటించారు. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ కూడా ఇచ్చారు.
ఐతే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి నెల లో 23 వ తారీఖు నుండి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు చెప్పారు. ఐతే అఫిషియల్ అప్డేట్ రావడంతో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తెలుతున్నారు. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ లో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో దునియా విజయ్ విలన్ రోల్ లో చేయగా అతని భార్యగా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక మెయిన్ రోల్ చేసి మంచి గుర్తింపు సాధించింది.