బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అంటూ మొత్తం దేశం మీద ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ్ సరసన సినిమాలలో నటించి తెలుగువారి హృదయాలను దోచుకున్న ఈమె ఫుగ్లీ తో తన కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఎట్టకేలకు తాను ప్రేమించిన సిద్ధార్థ మల్హోత్రాలను వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా సిద్ధార్థ కంటే ముందు కియారా చాలామందితో ఎఫైర్ నడిపిందని వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.

మోహిత్ మోర్వా:
ఫుగ్లీ సినిమాలో మోహిత్ తో కియారా అద్వానీ నటించింది. ఇదే సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. డేటింగ్ కూడా చేశారు. కానీ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు.

ముస్తఫా బర్మవాలా:
అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో వచ్చిన మెషీన్ సినిమాలు వీరిద్దరూ జంటగా నటించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరిపై అనేక వార్తలు పుట్టుకొచ్చాయి .. ఒక ఏడాది పాటు వీరి వ్యవహారం బాగానే సాగింది కానీ ఏమైందో తెలియదు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.


వరుణ్ ధావన్:
వరుణ్ ధావన్ కియారా అద్వాని కలంక్ సినిమాలో కలిసి నటించారు .. ఈ సినిమా సమయంలో వీరిద్దరూ డేటింగ్ చేయడం కూడా మొదలుపెట్టారు.. అంతేకాదు పలు ఈవెంట్లలో పాల్గొనడం చూసి నిజంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.  కానీ ఈ వార్తలపై ఖండించిన వీరు తాము స్నేహితులమని స్పష్టం చేశారు.

సిద్ధార్థ మల్హోత్రా:
చివరిగా సిద్ధార్థ మల్హోత్రాతో కియారా అద్వానీ షేర్షా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడింది అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు షూటింగ్ మొదలైన రోజు నుంచి ఈ జంట టాక్ ఆఫ్ ది టౌన్ గామారిపోయింది కానీ అనుకున్నట్టుగానే ఈ జంట అటు ప్రేమలో ఇటు జీవితంలో కూడా విజయం సాధించారు.  ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: