ప్రేమికులందరు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసే రోజు రానే వచ్చింది. అదే ఫిబ్రవరి పదనాల్గు. ఆ రోజు  ప్రేమికుల దినోత్సవం అవ్వడంతో  ప్రతి ఒక్కరు వాలెంటైన్స్ డేను చాలా  ఘనంగా జరుపుకుంటున్నారు. దీంట్లో భాగంగానే  సెలబ్రిటీలు సైతం వాలెంటైన్స్ డే పురస్కరించుకొని  సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ తమలో ఉన్నటువంటి ప్రేమనుభూతిని బయటపెడుతున్నారు.

ఐతే దీంట్లో భాగంగానే  తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రానా భార్య మిహికా బజాజ్ కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా రానాతో కలిసి దిగినటువంటి పిక్స్ని షేర్ చేస్తూ రానా పై తాను చూపుతున్నటువంటి ప్రేమను చెప్పకనే చెప్తున్నది.

ఐతే మిహికా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి పిక్స్ లను షేర్ చేస్తూఅన్నది ఏమని అంటే నేను చాలా స్ట్రాంగ్, వైల్డ్ , స్వీట్ ఇంకా వండర్ ఫుల్ ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు తెలుగు లో పదాలు సరిపోవు. అందుకే నువ్వు నన్ను ఇంతలా లవ్ చేయడంలో  ఆశ్చర్యం లేదు.ఐతే ఆమె నవ్వుతూ నువ్వు రోజంతా నన్ను విసిగించిన నీ నవ్వు తిరిగి నన్ను నీ ప్రేమలో పడేలా చేస్తుంది అని తాను రానా మీద తనకున్న ప్రేమను చాటింది.హ్యాపీ వాలెంటైన్స్ డే రానా అంటూ మిహికా బజాజ్ నెట్టింటా  వేదికగా రానా పై తనకున్నటువంటి ప్రేమను తెలియజేశారు. ఇలా ఈమె ఇలాంటి ఒక రొమాంటిక్ ఫోటోని షేర్ చేస్తూ రానా పై తనకున్న ప్రేమను అందరికి తెలియజేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే దీనిపై మన విక్టరీ  వెంకీ కుమార్తె ఆశ్రిత కూడా స్పందిస్తూ క్యూట్ కపుల్స్ అంటూ ఆమె కామెంట్ చేశారు.ఈ విధంగా ఎంతోమంది ఫ్యాన్స్ కూడా ఈ పోస్టుపై స్పందిస్తూ వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఐతే ఇంకా రానా సినిమాల విషయానికి వస్తే ఈయన హీరోగా నటించిన విరాటపర్వం మూవీ తర్వాత ఎలాంటి సినిమాలకు ఆయన కమిట్ అవలేదు. అయితే తన బాబాయ్ ఐనటువంటి విక్టరీ వెంకటేష్ తో కలిసిఆయన మాత్రం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లోచేస్తున్న సంగతి అందరికి తెల్సిందే. ఐతే ఈ వెబ్ సిరీస్ అనేది త్వరగానే ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి మేకర్స్ తెగ ట్రై చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: