న్యాచురల్ స్టార్ నాని మొదటి పాన్ ఇండియా సినిమా దసరాకి ప్రీ రిలీజ్ బిజినెస్  భారీగా జరిగిపోయింది. నాని కెరీర్ లోనే రికార్డు స్థాయిలో జరిగిందట.అయితే ఇప్పుడు ఈ సినిమా దిల్ రాజు క్యాంప్ కు చేరిందని సమాచారం తెలుస్తోంది. ఇక అసలు నిర్మాత సుధాకర్ చెరుకూరి.. దసరా సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను హోల్ సేల్ గా మొత్తం రూ. 24 కోట్ల భారీ రేటుకు చదలవాడ శ్రీనివాసరావుకు అమ్మేశారు. ఈ లోగా దసరా టీజర్ రిలీజై ఎంతగానో ఆకట్టుకొని పాటలు కూడా దుమ్ము రేపాయి. దీంతో ఇక వెంటనే దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఊహించని ఆఫర్ ఇచ్చి చదలవాడ శ్రీనివాసరావు దగ్గర తెలుగు రాష్ట్రాల హక్కులు కొనేశారని సమాచారం తెలిసింది. ఇక చదలవాడ కొన్నదానికి కన్నా నాలుగు కోట్లు ఎక్కువ ఇచ్చి మరి తీసుకున్నాడని సమాచారం తెలుస్తుంది. దీంతో సినిమా రిలీజ్ కు ముందే చదలవాడ చాలా బాగా లాభపడ్డారు.


అయితే అలా దిల్ రాజు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ను సొంతం చేసుకోవడానికి నిర్మాతలకు ఏకంగా రూ.28 కోట్లు చెల్లించినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇప్పుడు ఈ రైట్స్ ద్వారా మరింత లాభాన్ని పొందేందుకు..దిల్ రాజు ఏరియా వైస్ గా భారీ రేటుకి అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే తన సొంత డిస్ట్రిబ్యూషన్ ఏరియాలు అయినా నైజం యూఏ తప్ప మిగితా ఏరియాలకు ఇలా ప్లాన్ చేస్తున్నారట. దీని ద్వారా తన పెట్టుబడిలో ఏకంగా 70 శాతం మొత్తాన్ని రికవరీ చేయమన్నాడు.కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మొదట్లో సినిమాపై ఎలాంటి బజ్ లేకపోయినా టీజర్ వచ్చాకా అంచనాలు ఒక రేంజిలో పెరిగిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద పాన్ ఇండియా హిట్ అవ్వడం ఖాయమని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: