మళయాళ భామలకు టాలీవుడ్ లో సూపర్ డిమాండ్ ఉంటుంది. ఆల్రెడీ అక్కడ సత్తా చాటిన భామలకు ఇంకాస్త ఎక్కువ క్రేజ్ ఉంటుంది. మళయాళంలో నటిస్తూ తమిళ సినిమాలు కూడా చేస్తూ వస్తున్న మాళవిక మోహనన్ తెలుగులో డైరెక్ట్ గా ఒక సినిమా చేయకపోయినా తెలుగులో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. దళపతి విజయ్ మాస్టర్ సినిమా తెలుగులో కూడా బాగానే ఆడింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవిక తెలుగు మేకర్స్ దృష్టిలో పడ్డది అయితే అప్పటి నుంచి ఆమెకు ఆఫర్లు వస్తున్నా అమ్మడి సెలెక్టెడ్ గా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది.

అందుకే తెలుగు సినిమాలు ఆచి తూచి అడుగులేస్తుంది. ఫైనల్ గా ప్రభాస్ సినిమాతో డైరెక్ట్ తెలుగు ఎంట్రీ ఇస్తుంది మాళవిక. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్న రాజా డీలక్స్ సినిమాలో మాళవిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అమ్మడు టాలీవుడ్ హాట్ ఫేవరెట్ అవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే తన ఫోటో షూట్స్ తో బీభత్సం సృష్టిస్తున్న అమ్మడు ప్రభాస్ సినిమా తర్వాత టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుందని అంటున్నారు. తెలుగులో కొద్దిగా క్రేజ్ వస్తే చాలు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి మరి ఆమె రేంజ్ పెంచుతారు.

మాళవిక కూడా అదే రేంజ్ హీరోయిన్ అవుతుందని అంటున్నారు. తప్పకుండా మాళవిక తన సత్తా చాటుతుందని చెప్పొచ్చు. కేవలం ఇన్నాళ్లు ఫోటో షూట్స్ తో అలరించిన మాళవిక ఇక మీదట తెలుగు సినిమాలు కూడా చేస్తూ తన క్రేజ్ పెంచుకోవాలని చూస్తుంది. చేస్తుంది ప్రభాస్ సినిమా కాబట్టి అమ్మడికి ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడం ఖాయం. ప్రభాస్ తో చేసింది అంటే మిగతా స్టార్ ఛాన్స్ లు కూడా వరుస కట్టడం పక్కా అని చెప్పొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: