కోలీవుడ్ లో ధనుష్ చేస్తున్న సినిమాలు చూస్తే ఆయన విలక్షణ కథలు.. పాత్రలతో సూపర్ హిట్లు కొడుతున్నారు. అలాంటి ఆయన్ని సార్ గా తెలుగు దర్శకుడు ఒప్పించడం క్రేజీగా మారింది. అయితే సార్ సినిమాలో వెనక త్రివిక్రం ఉన్నాడనే నమ్మకంతోనే ధనుష్ ఈ సినిమా చేసి ఉండొచ్చని టాక్. కానీ త్రివిక్రం ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యాడే తప్ప సినిమా కంటెంట్ విషయంలో అసలు జోక్యం చేసుకోలేదని తెలుస్తుంది. అంతేకాదు తన పెన్ను సాయం కూడా ఈ సినిమాకు అందించినట్టు లేడని అర్ధమవుతుంది.
సార్ సినిమా ప్యూర్లీ వెంకీ అట్లూరి సినిమాలానే తీసేలా చేశారు. ధనుష్ కూడా దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా అతను ఎలా చూపించాలని అనుకున్నాడో అలానే చేశాడని తెలుస్తుంది. కొన్ని సినిమాలు కథ గా రాసుకున్నప్పుడు బాగుంటాయి సినిమా తీసినప్పుడు ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఈ సినిమాకు రాసుకున్న కథ కన్నా తెర మీద ఇంకా అద్భుతంగా ఉందని త్రివిక్రం అన్నాడు. ఆ ఒక్క మాట చాలదా వెంకీ ఈ సినిమా ఎలా చేశాడు అని చెప్పడానికి. సో సార్ కచ్చితంగా సత్తా చాటుతాడనే చెప్పొచ్చు.