ఇక స్టోరీ విషయంలోకి వస్తే ధనుష్(బాలు )ఈ సినిమాలో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా సిరిపురంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలకు లెక్చరర్ గా వెళ్లాల్సి ఉంటుంది. అందులో లెక్చరర్ గా పనిచేస్తున్న సంయుక్త మీనన్(మీనాక్షి) ను తొలిచూపులోనే ఇష్టపడతారు. ఇదంతా ఎలా ఉంటే గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటున్న కొంతమంది స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతూ ఉంటారు. విలన్ గా నటించిన సముద్రఖని.. తన ఎడ్యుకేషనల్ బిజినెస్ పాడవుతుందని అక్కడున్న పిల్లలని చదవనీయకుండా అడ్డుపడుతూ ఉంటారు. అయితే ఆ పిల్లలు చదువుకొని ప్రయోజకులు అయ్యారా లేదా అనే విషయమే మిగిలిన కథ.
కథ కొత్తగా ఏమీ లేకపోయినా కానీ చెప్పిన విధానం మాత్రం చాలా కొత్తగా అనిపిస్తోందని స్క్రీన్ ప్లే వరకు డైరెక్టర్ అట్లూరి తన మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు. ఇందులో కొన్ని ఎమోషన్స్ సన్నివేశాలు జోడించి స్క్రీన్ మీద ఒక మాయ చేసారు డైరెక్టర్, హీరో ధనుష్. ముఖ్యంగా మార్కెట్లో వ్యాపారంగా మారిన చదువుని ఈ సినిమాలో ఎంత అద్భుతంగా చూపించారు. ఈ సినిమాను చూపించడం విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు ధనుష్, డైరెక్టర్. ఇందులోని ప్రతి ఒక్కరి పాత్ర చాలా అద్భుతంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కామెడీ మరొకవైపు ఎమోషనల్ ఓవరాల్ గా ధనుష్ ఈ సినిమాతో తెలుగులో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.