ఇక తర్వాత హోమ్లి ఇమేజ్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. 2012లో నటుడు ప్రసన్నాను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అయితే పెళ్లికి ముందు వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. కానీ వీరిద్దరూ మాత్రం ఆ విషయాన్ని ఖండించారు. వీరికి ప్రస్తుతం ఒక అబ్బాయి అమ్మాయి కూడా కలదు గత ఏడాది స్నేహ ప్రసన్న విడిపోతున్నారు అని వార్తలు ఎక్కువగా వినిపించాయి కానీ ఈ వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన స్నేహ పలు చిత్రాలలో వదిన అక్క పాత్రలలో నటించింది. అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఉపేంద్ర భార్య పాత్రలో నటించింది. ఇక రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలో వదినగా నటించింది. ఇక సినిమా ఆఫర్లు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగానే అందుకుంటుంది స్నేహ మలయాళం లో ఏడాది విడుదలైన చిత్రం క్రిస్టోఫర్.. ఈ సినిమా మమ్ముట్టి హీరోగా నటించారు. 2020లో ధనుష్ జంటగా నటించిన పటాస్ సినిమా పర్వాలేదు అనిపించుకుంది తాజాగా గ్రీన్ డ్రెస్సుల తన అంద చందాలతో బాగా ఆకట్టుకుంటుంది స్నేహ. ఇప్పటికీ కూడా అదే ఫిజిక్ అదే అందంతో అందరిని ఆకట్టుకుంటోంది.