టాలీవుడ్ లో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రి ఇచ్చి వరుసగా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరిచిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నారు చిరంజీవి. చిరంజీవి ఇప్పటికే కొన్ని చిత్రాలు కూడా లైన్లో పెట్టుకున్న సంగతి తెలిసినదే.. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమిక్స్ చేయబోతున్నారు.


ఈ సినిమాని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా ఇందులో కొన్ని ప్రతిష్టాత్మకమైన సన్నివేశాలను కూడా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది ప్రారంభించారు. అప్పటినుంచి ఈ సినిమా షూటింగ్ సెర వేగంగా జరుగుతూనే ఉంది. ఇందులో భాగంగానే కొన్ని షెడ్యూల్స్ ను కూడా కంప్లీట్ చేసినట్లు ఇటీవలే ఒక భారీ కాస్టింగ్ తో సాంగ్ కూడా పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భోళా శంకర్ మూవీలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నది.


ఇక ఇందులో ఈమెకు జోడిగా నటించాల్సిన ఒక యంగ్ హీరో పాత్ర కూడా ఉందని సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ తర్జనభర్జన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ పాత్రకు హీరో నితిన్ కానీ నాగశౌర్యను కానీ తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పైన తాజాగా ఒక యంగ్ హీరో పేరు డైరెక్టర్ మెహర్ రమేష్ కు చిరంజీవి సూచించినట్లుగా తెలుస్తోంది.ఆ హీరో ఎవరు అనే విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఇక ఇందులో హీరోయిన్ గా తమన్నా కూడా నటిస్తున్నది. ఎంతోమంది నటీనటులు సైతం ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: