భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీని అయితే సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా మేనియా ఇంకా కూడా తగ్గలేదని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి చాలా రోజులవుతున్న కానీ ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయం గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు అన్న సంగతి అధికారికంగా ప్రకటించి చాలా రోజులు అయిన ఆ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి తాజా అప్డేట్లు మాత్రం రాలేదు. ఇకపోతే ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనుంది అంటూ వార్తలు జోరుగా వినిపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ఫోటో షూట్ లో కూడా జాన్వీ పూర్ పాల్గొంది అంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త మాత్రం తెగ వినిపిస్తుంది.. ఎన్టీఆర్ సినిమాకు గాను జాన్వీ కపూర్ భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టు సమాచారం..