ఒకప్పటి స్టార్ హీరోయిన్ ల లో ఒకరైన ఆమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను అయితే చెప్పుకొచ్చారు. 1990 నుంచి 1997 వరకు తాను 50 సినిమాల లో నటించానని ఆమె చెప్పుకొచ్చారు.. ఒకే ఏడాది 11 సినిమాల లో కూడా నటించానని ఆమని పేర్కొన్నారు.

ఒకే రోజులో మూడు సినిమాల షూటింగ్ ల లో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె కామెంట్లు చేశారు. రేలంగి నరసింహారావు గారు రెస్ట్ లేకుండా అస్సలు వర్క్ చేయవద్దని సూచించారని ఆమని చెప్పుకొచ్చారు.కొన్ని సినిమాలు అనుకున్న ఫలితాన్ని అందుకోని సమయం లో కొత్త ఆఫర్లు రావేమో అని కూడా భయం వేసింది అని ఆమె కామెంట్లు చేశారు. నాకు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బాగా బోర్ కొడుతుంది అని ఆమని అన్నారు.

రాఘవేంద్రరావు నా విషయం లో ఫ్రూట్స్ వాడలేదని కూడా ఆమె తెలిపారు. నాకోసం స్టీల్ బిందెలు వాడారని ఆమని చెప్పుకొచ్చారు. భీమవరం బుల్లోడా సాంగ్ జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చని సాంగ్ కాగా నా సాంగ్ నచ్చకపోవడం ఏంటి అని కూడా ఆమె కామెంట్ చేశారు. బయట అందరికీ ఆ సాంగ్ తెగ నచ్చిందని ఆమె తెలిపారు. ఈవీవీ గారు అడగడంతో రెండు సాంగ్స్ లో నేను చేశానని ఆమని వెల్లడించడం విశేషం.. ప్రస్తుతం ఆమని క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనదైన శైలి లో రానిస్తున్నారు. వరుసగా ఆఫర్స్ కూడా దక్కించుకుంటున్నారు.

ఒక ఆర్టిస్ట్ గా అన్నీ పాత్రలు చేయాలని ఆమని అన్నారు. రమ్యకృష్ణ అన్ని రకాల పాత్రల్లో చేశారని కూడా ఆమని తెలిపారు. చిరంజీవి గారి సినిమాలో నాకు ఆఫర్ వచ్చింది కానీ డైరెక్టర్ మారడంతో ఆ సినిమాలో ఆఫర్ మిస్ అయిందని ఆమె అన్నారు. ఆ సినిమాలో ఛాన్స్ కోసం ఎన్నో అవకాశాల ను అయితే మిస్ చేసుకున్నానని ఆమని వెల్లడించడం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: