పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా ఇప్పటికీ అందరికీ గుర్తుంటే ఉంటుంది. ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత మంది అభిమానులను ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయాన్ని అందుకున్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం బాగా అలరించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మీరా చోప్రా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ధరణి దర్శకత్వం వహించడం జరిగింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా 2006లో రిలీజ్ అయ్యి ఆశించినంత స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. 

ఇది ఇలా ఉంటే ఇక ఈ సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన చిన్నారి చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇక చిన్నారి పేరు సనూష. అయితే ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మీరే చోబ్రా ఏం చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. కానీ ఆ చిన్నారి మాత్రం ఇప్పుడెలా ఉంది ఏం చేస్తుంది అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే ఆ చిన్నారి ఏం చేస్తుంది ఎక్కడుంది అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాలో చిన్నారి సనూష ఇప్పుడు నటిగా మారింది. అంతేకాదు పలు సినిమాల్లో కొన్ని కీలకపాత్రలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది. నాని నటించిన జెర్సీ సినిమాలో కూడా నటించింది సనూష. తెలుగుతోపాటు మలయాళం లో కూడా చాలా సినిమాల్లోనే నటించింది.

 బంగారం సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ సినిమా అనంతరం మేధావి అనే సినిమా కూడా చేసింది సనూష. ఇక ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇక ఈమె చివరిగా జెర్సీ సినిమాలో కనిపించింది. తాజాగా ఈమెకి సంబంధించిన ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో సనూష హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: