ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి జనాల్లో ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుమారు పది సంవత్సరాలుగా ఈ షో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతానికి గతంలో ఎన్నడు లేనంత దారుణమైన రేటింగ్స్ ను జబర్దస్త్ నమోదు చేస్తోంది. కొన్నాళ్లుగా ఈ కామెడీ షో కి రేటింగ్ చాలా తక్కువగా వస్తుంది. అయినా కూడా మల్లెమాల వాళ్ళు ఈ షోను నడిపించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎక్కువ రెమ్యునేషన్ డిమాండ్ చేసేవాళ్లను మల్లెమాల నుండి తప్పిస్తున్నారు. ఈ కారణం తోనే సుడిగాలి సుదీర్, హైపర్ ఆదిని మల్లెమాల వారు కాదనుకున్నారు. తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే కమెడియన్స్ ని రంగంలోకి దించుతున్నారు. 

ఇక ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వాళ్లు ఎవరు అనే విషయానికొస్తే గెటప్ శీను పేరు బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ లో గెటప్ శీను, రాంప్రసాద్ టీం లీడర్స్ గా ఉన్నారు. అయినా కూడా ఈ ఇద్దరిలో గెటప్ శీనుకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. రాంప్రసాద్ కి ఇటు నటుడిగా అటు రచయితగా మంచి పారితోషమే వస్తుందట. గెటప్ శీను మాత్రం సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా జబర్దస్త్ షో కి టైం కేటాయిస్తున్నాడు. ఇక వీళ్ళ స్కిట్స్ కి కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే గెటప్ శీను కి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇక అతని తర్వాత జబర్దస్త్ లో రాకెట్ రాఘవ,

సద్దాం ఇద్దరూ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జబర్దస్త్ లో సద్దాం స్కిట్స్ ని ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యే జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన సద్దాం టీం తక్కువ సమయంలోనే తమ స్కిట్స్ తో ఆడియన్స్ ఎంతో బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న అన్ని టీమ్స్ లో సద్దాం టీం నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఇటు ఎక్స్ట్రా జబర్దస్త్ లో గెటప్ శీను, రాంప్రసాద్ స్కిట్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నా.. ఇందులో సుడిగాలి సుదీర్ మిస్ అవ్వడంతో చాలామంది ఆడియన్స్ సుధీర్ మళ్లీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: