సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ అనే క్రేజీ ప్రాజెక్ట్
కి అనిరుధ్ ప్రస్తుతం సంగీతం అందిస్తున్నాడు .
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ కి కూడా ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నాడు .
తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో మూవీ కి కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
అజిత్ హీరో గా రుపొందుతున్న ఏకే 67 మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ మూవీ కి కూడా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ 30 మూవీ కి కూడా ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం వరుస క్రేజీ మూవీ లతో అనిరుద్ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.