RRR చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవం తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా పాన్ వరల్డ్ క్రేజ్ సంపాదించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా అవార్డుల పంట కూడా అందుకుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకున్న ఈ చిత్రం. మరి కొన్ని అవార్డులు కూడా అందుకోబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా హాలీవుడ్ క్రిస్టియన్ అసోసియేషన్..HCA ఫిలిం అవార్డులో కూడా rrr చిత్రం నాలుగు పురస్కారాలను అందుకున్న సంగతి తెలిసిందే.


ఈ వేడుకకు హాజరైన రామ్ చరణ్ వాయిస్ మోషన్ క్యాప్చర్ పెర్ఫార్మషన్స్ విభాగాలలో సైతం విజేతగా ప్రకటించడం జరిగింది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును కూడా రామ్ చరణ్ రాజమౌళి సంయుక్తంగా అందుకోవడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా రామ్ చరణ్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపద్యంలోనే రామ్ చరణ్ ను జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కు అభినందనలు  తెలపడం జరిగింది.
ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులో rrr చిత్రానికి పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం ఈ వేదిక పైన బెస్ట్ వాయిస్ మోషన్ క్యాప్చర్ పెర్ఫార్మషన్స్ కు రామ్ చరణ్ కు అవార్డు ప్రకటించడం స్పాట్లైట్ అవార్డు స్వీకరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తెలియజేశారు. రామ్ చరణ్ కు డైరెక్టర్ రాజమౌళికి చిత్ర బృందానికి తన హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. రామ్ చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలు చేసి ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఘనవిజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా ఒక లెటర్ ని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక లెటర్ వైరల్ గా మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: