మెగా డాటర్ శ్రీజ కొణిదల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈమె గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మొదటగా ఈమె శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని అప్పట్లో కుటుంబ సభ్యులకు దూరమైంది. ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. కొంతకాలం తర్వాత శిరీష్ తో విడాకులు తీసుకుని మళ్లీ కుటుంబ సభ్యుల వద్దకే వచ్చేసింది శ్రీజ. ఆ తర్వాత కొన్నాళ్లకు కుటుంబ సభ్యులు శ్రీజను కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి పెళ్లి చేశారు. చాలా కాలం పాటు శ్రీజ, కళ్యాణ్ కలిసి ఉన్నారు. అయితే గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. 'విజేత' అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ను మెగా ఫ్యామిలీ గత కొంతకాలంగా పట్టించుకోవడం లేదు. 

ప్రస్తుతం అతని చేతిలో సినిమాలు కూడా లేవు. దాంతో హీరోగా ఇక కళ్యాణ్ దేవ్ కెరీర్ ముగిసినట్లే అని చెప్పాలి. అయితే కొంతకాలంగా శ్రీజ కళ్యాణ్ దేవ్ తో విడిపోయిందని వార్తలు రావడం జరిగింది. అయితే దీనిపై అధికారిక సమాచారం అయితే రాలేదు. కానీ ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా కళ్యాణ్ దేవ్ పోస్ట్ షేర్ చేశాడు. ఆ పోస్టులో కళ్యాణ్ దేవ్ పేర్కొంటూ..' ఒక మనిషిని ఇష్టపడడం కంటే అతన్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం అనేది ముఖ్యం' అని పోస్ట్ పెడితే.. అటు శ్రీజ కూడా.. 'ఒకరిని ప్రేమించడం అంటే వాళ్ళని వాళ్ళు అధికంగా ప్రేమించుకునేలా చేయాలి. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించేలా చేసుకోవడం కాదు ప్రేమను గుర్తించాలి'.. అంటూ పోస్ట్ చేసింది.

దీనితో వీళ్ళిద్దరూ విడిపోయారని అందరికీ క్లియర్గా అర్థమైంది. ఇక తాజాగా కళ్యాణ్ దేవ్ పెళ్లి డ్రెస్ లో ఓ అమ్మాయి తో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటో చూసి చాలా మంది కళ్యాణ్ దేవ్ కి రెండో పెళ్లి అయింది అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే చాలామంది ఇదే నిజం అనుకుంటున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదని సమాచారం. ఈ ఫోటో అతని ఫ్రెండ్ మ్యారేజ్ లో దిగిన ఫోటో అని.. తన ఫ్రెండ్ మ్యారేజ్ లో కళ్యాణ్ దేవ్ ఈ ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో నెటిజెన్స్ మాత్రం కళ్యాణ్ దేవ్ పెళ్లి బట్టల్లో ఉండడం, పక్కనే పెళ్లి కూతురు కూడా ఉండడంతో అతను రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ వార్తలను ప్రచారం చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: