పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రామాయాణం కథ ఆధారంగా వస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తూ ఉండగా మరో సీనియర్ స్టార్ హీరో అయిన సైఫ్ ఆలీఖాన్ రావణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఈ టీజర్ పై ఊహించని రేంజిలో విపరీతమైన నెగిటివిటి వచ్చింది.రామాయణం కథని అందులోని పాత్రలని వక్రీకరించి ఆదిపురుష్ సినిమా తీసారని పైగా ఇది కార్టూన్ సినిమా కంటే దారుణంగా ఉందని నెటిజన్స్ విమర్శలు చేశాయి. అలాగే పాత్రల చిత్రణ కూడా కరెక్ట్ గా లేదని కామెంట్స్ చేశారు. ఇలాగే సినిమా రిలీజ్ చేస్తే కచ్చితంగా అడ్డుకుంటామని కొన్ని హిందూ సంఘాల వారు కూడా హెచ్చరించారు.


దీంతో సంక్రాంతి పండక్కి అనుకున్న రిలీజ్ ని వాయిదా వేశారు. జూన్ 16 వ తేదీకి సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ విజువల్ ఎఫెక్ట్స్ పై మూవీ యూనిట్ వర్క్ చేసింది.ఇక  తాజాగా ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మెజారిటీ పార్ట్ పూర్తయ్యిందని సమాచారం తెలుస్తుంది. అలాగే రిలీజ్ డేట్ లో కూడా ఇంకా ఎలాంటి మార్పు ఉండదని సమాచారం తెలుస్తుంది. మార్చి నెలలో ఈ సినిమా నుంచి ఒక హై వోల్టేజ్ సాంగ్ ని రిలీజ్ చేసి మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి మూవీ యూనిట్ రెడీ అవుతుందని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ మూవీని వీలైనన్ని ఎక్కువ భాషలలో విడుదల చేయడానికి టి-సిరీస్ ప్లాన్ చేస్తుందని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ అండ్ లవ్ ఎలిమెంట్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయని సమాచారం తెలుస్తుంది. ఇక ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేయబోయే పాటతో కచ్చితంగా మూవీపై  హైప్ అనేది ఖచ్చితంగా డబుల్ అవుతుందని మూవీ యూనిట్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: