ఇక తెలుగు లో గ్యాంగ్ లీడర్, బెస్ట్, తిరు, జెర్సీ, దర్బార్ మరియు అజ్ఞాతవాసి వంటి సినిమాలకు సంగీతం అందించాడు. ఇక ఇతనిని మొదట గుర్తించింది మాత్రం వై దిస్ కొలెవరి పాటతోనే. కేవలం సినిమాలతోనే కాదు లైవ్ కాన్సెర్ట్స్ చేయడం లోను అనిరుద్ దిట్ట అని చెప్పవచ్చు.
ఫారెన్ లో ఒక లైవ్ షో పెడితే దాదాపు పది కోట్ల రూపాయల మేర టికెట్స్ రూపం లో వచ్చాయని సమాచారం.. ఇంకా చాల మందికి టికెట్స్ కూడా దొరకలేదటా.. అంత డిమాండ్ ఉంది ప్రస్తుతం అనిరుద్ కి.పైగా సింగర్ కం యాక్ట్రెస్ అయినా ఆండ్రియా తో లిప్ లాక్ వల్ల ఆయనలో మరొక రొమాంటిక్ యాంగిల్ కూడా బయట పడింది.బాగా ట్యాలెంట్ ఉంది కాబట్టి ఈ వేషాలు ఏమి అంతలా హైలెట్ అవ్వలేదు.
ఇక తన సంగీతం తో ఎంతలా అభిమానులను సంపాదించుకుంటున్నాడో లైవ్ కాన్సెర్ట్ కి కూడా అదేవిధంగా సంపాదించాడు.. ఈ విషయం లో అనిరుద్ తోపు అనిచెప్పొచ్చు. ఒక లెజెండ్ కాన్సెర్ట్ హైదరాబాద్ లో నిర్వహిస్తే చాలా దారుణంగా రివ్యూ లు రావడం మనం కూడా చూస్తూనే ఉన్నాం. ఇక ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇండియాలోనూ మరియు బయట దేశాల్లో కచేరి లు పెడితే కూడా కుప్పలు కుప్పలుగా అయితే జనాలు వచ్చేవారు.సింగర్ చిత్ర సైతం అనేక లైవ్ కచేరీలను ఎంతో విజయవంతంగా చేసింది. కానీ ఇప్పుడు ఇలా లైవ్ కాన్సెర్ట్ చేయాలంటే అది అంత ఈజీ అయినా పని కాదు. గతం లో జేసుదాసు కూడా తన మొదటి లైవ్ కాన్సెర్ట్ నిబాగా చేసి రెండవసారి ఘోరంగా ఫ్లాప్ అయ్యారు.. మరి పెద్ద పెద్ద లెజెండ్స్ చేసిన కూడా ఇలా పరాజయం అవుతున్న కచేరీలు కేవలం అనిరుద్ వంటి కుర్ర కంపోజర్ అతి సులువుగా చేసేస్తున్నాడు.