మార్చి 13వ తేదీన ఆస్కార్ అవార్డు వేడుక రంగ రంగ వైభవంగా జరగబోతోంది. rrr సినిమాకు సంబంధించి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో నాటు నాటు సాంగుకు నామినేట్ అయిన నేపథ్యంలో రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ కూడా లైఫ్ పర్ఫామెన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకపక్క కీరవాణి చంద్రబోస్ కూడా ఈ లైన్ప్ సంబంధించి ఇటీవల అమెరికా మీడియాతో మాట్లాడడం జరిగిందట. ఇక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులకు సంబంధించి rrr సినిమాకి దాదాపుగా నాలుగో అవార్డులు లభించాయి. ఈ నాలుగు అవార్డులను రాజమౌళి, రామ్ చరణ్ ,కీరవాణి rrr సినిమాటోగ్రాఫర్ సెందిల్ కుమార్ సహా రాజమౌళి కుమారుడు కార్తికేయ కలిసి అందుకున్నారు.
ఈ అవార్డులకు పవన్ , చిరంజీవి ,నాగబాబు ఇలా అందరూ కూడా రామ్ చరణ్ ని పొగడడం జరిగింది. ఎన్టీఆర్ ని కావాలని పక్కన పెట్టారని రామ్ చరణ్ ని అందరు ప్రమోట్ చేస్తున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. దీంతో ఈ విషయం పొలిటికల్ గా కూడా తీసుకొస్తూ పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు హాలీవుడ్ క్రిటిక్స్ కి ఒక బహిరంగ లేక కూడా రాసినట్లు సమాచారం..దీంతో హాలీవుడ్ క్రెటిక్స్ మా నుంచి ఆయనకు అందవలసిన అవార్డులు త్వరలోనే అందుతాయని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తెలియజేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టినట్లుగా సమాచారం