దాదాపు మూడేళ్ల విరమం తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్స్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ ఇప్పుడు ఏకంగా ఒకేసారి నాలుగు ప్రాజెక్ట్లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ నాలుగు ప్రాజెక్టులు కాకుండా మరిన్ని సినిమాలో చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వినోదయ సీతం రీమేక్ ని కూడా మొదలు పెట్టేసారు. తమిళ సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన జి ఫైవ్ ఓ టి టి లో నేరుగా స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాకు డైరెక్టర్గా సముద్రఖని వ్యవహరించడంతో పాటు ఒక ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నాడు. 

ఈ సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన మరొక హీరో కూడా నటిస్తున్నారు. ఇక ఆయనెవరు కాదు సాయి ధరంతేజ్. మల్టీస్టారర్ గా ఈ సినిమాపై భారీ అంచనాలో నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇద్దరు మెగా హీరోల కాంబినేషన్లో రానున్న ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే భారీ ఎత్తున ప్లాన్లను వేస్తుంది చిత్ర బృందం. ఇక ఈ సినిమా కోసం కేవలం 30 రోజుల డేట్లు మాత్రమే పవర్స్టార్ కేటాయించారు. 

దీంతో ఈ సినిమాని మీ చివరి నాటికి పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేయాలని అనుకుంటున్నారట చిత్ర బృందం. ఆ సమయంలో హాలిడేకు తోడుగా లాగ్ వీకెండ్ కూడా ఉండడంతో ఈ సినిమాకి భారీ కలెక్షన్లను కూడా వచ్చే అవకాశాలు కనిపించడంతో చిత్ర బృందం ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: