ఇక మార్చి 12వ తేదీన ఆదివారం నాడు ఈ వేడుక జరగబోతున్నది. అకాడమీ అవార్డుల నుంచి అధికారికంగా ఈ తేదీ ఖరారు అయినట్లుగా సమాచారం. rrr చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు సాంకేతిక నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా నాటు నాటు పాటకు కూడా బాగా పాపులర్ అవ్వడమే కాకుండా రెస్పాన్స్ కూడా అదిరిపోయేలా వస్తోంది.
ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అందుకున్నది.ఇక హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను ఐదు విభాగాలలో దక్కించుకుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన rrr చిత్రం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకున్నది. మార్చి 12వ తేదీన లాస్ట్ ఏంజెల్ వేదికగా ఈ అవార్డును ప్రధానోత్సవం జరగబోతోంది.
ఇటీవల కాలంలో రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు పొందడమే కాకుండా పాన్ వరల్డ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి ఫిక్స్ అయ్యారు.