మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ కొంత పూర్తైందని తెలుస్తోంది. అతడు మరియు ఖలేజా సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం విశేషం.. మహేష్ కు జోడీగా పూజా హెగ్డే మరియు శ్రీలీల నటిస్తుండగా తాజాగా శ్రీలీల ఈ సినిమా షూట్ లో జాయిన్ అయ్యారని కూడా సమాచారం అందుతోంది.
మహేష్ ఈ సినిమాలో పవర్ ఫుల్ కాప్ రోల్ లో కనిపిం చనున్నారని సమాచారం.ఇంతకు ముందు పలు సినిమాలలో పోలీస్ పాత్ర లో నటించి మహేష్ విజయాలను సొంతం చేసుకోగా ఈ సినిమాతో మహేష్ ఖాతాలో మరో విజయం సాధిస్తుందని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా త్రివిక్రమ్ సినిమాలకు వరుసగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
అయితే మహేష్ సినిమాలకు థమన్ ఆశించిన స్థాయి లో మ్యూజిక్ ఇవ్వడం లేదని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లకు చెక్ పెట్టేలా థమన్ కొత్త ట్యూన్స్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. సినిమా సినిమాకు థమన్ మార్కెట్ పెరుగుతున్న విషయం తెలిసిందే. థమన్ తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోల సినిమాలకు అయితే పని చేశారు.
థమన్ పారితోషికం ప్రస్తుతం 4 నుంచి 5 కోట్ల రూపాయల స్థాయిలో ఉంది. మహేష్ థమన్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కాగా త్రివిక్రమ్ సినిమా తో ఈ కాంబినేషన్ మళ్లీ సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి మరి. సినిమా సినిమాకు అటు మహేష్ క్రేజ్ పెరుగుతుండగా ఇటు థమన్ తన క్రేజ్ ను కూడా పెంచుకుంటున్నాడు.