షారుక్ ఖాన్ భార్య గౌరీఖాన్ ప్రమోట్ చేయడం వల్ల తాను ఈ ప్లాట్ ను కొనుగోలు చేశానని తెలియజేశారు ఇప్పుడు కంపెనీ వారు మోసం చేశారని బాధితుడు వారి పైన కేసు నమోదు చేయడం జరిగింది. బాధితుడు ఫిబ్రవరి 25వ తేదీన ఈ కేసును నమోదు చేసినట్లుగా సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయం బయటికి రాలేదు. బాధితుడు జస్వంత్ సాహూ మహారాష్ట్రలోని ముంబైలో అంతేరి ఈస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతను చెప్పిన వివరాల ప్రకారం 2015 వ సంవత్సరంలో గౌరీ ఖాన్ లక్నోకు చెందిన తులసియాని కంపెనీ ప్రమోట్ చేయడం జరిగిందట.
లక్నౌలోని షాహిద్ పాతులో తులసియాని కంపెనీ ఒక టౌన్ షిప్టును అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని గౌర ఖాన్ ప్రకటనను చూసి తర్వాత జస్వంత్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ ను తులసియానిని సంప్రదించినట్లు తెలియజేశారు. వీరిద్దరూ రూ.86 లక్షలకు ఫ్లాట్‌ను అమ్మడానికి డీల్ ఫిక్స్ చేసినట్లు తెలియజేయడం జరిగింది. ఈ ఫ్లాట్ ను బ్యాంకు నుంచి అప్పుగా తీసుకువచ్చి కట్టానని బాధితుడు తెలిపారు. 2016లో అక్టోబర్‌లో ఫ్లాట్ ను రిజిస్ట్రేషన్ చేసి అప్పగిస్తామని కంపెనీ హామీ కూడా ఇచ్చిందని తెలిపారు. అయితే ఆ తర్వాత ఫ్లాట్ ను అప్పగించకపోవడంతో కంపెనీ నష్టపరిహారం కింద రూ.22.70 లక్షల రూపాయలు చెల్లించి ఆరు నెలలలోనే ఫ్లాట్ ను అప్పగిస్తామని తెలియజేసిందట.ఇది విఫలమైతే ఇచ్చిన డబ్బులకు వడ్డీతో పాటు మొత్తం తిరిగి ఇస్తామని కంపెనీ తెలిపిందట. కానీ ఆ ఫ్లాట్ ను వేరొక పేరు మీదకి అగ్రిమెంట్ కుదురుచున్నట్లు బాధితుడు తెలియజేయడం జరిగింది.