పాన్ ఇండియా స్టార్ అయిన ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న స్టార్ స్టేటస్ ఏ హీరోకి కూడా లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.బాహుబలి సిరీస్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని దక్కించుకున్న ప్రభాస్ పేరిట వేల కోట్ల రూపాయిల బిజినెస్ కూడా జరుగుతుంది. ప్రభాస్ ఒక్క ఫ్లాప్ సినిమా నేటి తరం పాన్ ఇండియన్ స్టార్స్ గా చెప్పుకునే ఎంతోమంది స్టార్ హీరోల కు సూపర్ హిట్స్ తో సమానం అని చెప్పొచ్చు.

అది నిజంగా ప్రూవ్ అయ్యిందని తెలుస్తుంది..అలాంటిది ఆయనకీ ఇప్పుడు సరైన బ్లాక్ బస్టర్ పడితే కనుక ఇండస్ట్రీ రికార్డ్స్ తో ఏ రేంజ్ లో ఆడుకుంటాడో ఊహించుకోవచ్చు.అందుకే ఫ్లాప్స్ పడిన ప్రభాస్ పై ఎన్ని కోట్లు పెట్టడానికైనా కూడా అస్సలు వెనకాడరు దర్శక నిర్మాతలు.ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడని సమాచారం.

KGF  దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ తో 'సలార్', మహానటి ఫేమ్ నాగ అశ్విన్ తో 'ప్రాజెక్ట్ K', ఓం రౌత్ తో 'ఆది పురుష్' మరియు యంగ్ డైరెక్టర్ మారుతీ తో 'రాజా డీలక్స్'.వీటిల్లో ఆది పురుష్ సినిమా చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది.మిగిలిన మూడు సినిమాలను కూడా పూర్తి చేస్తున్నాడటా ప్రభాస్.దీనితో ఆయన పై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడడం వల్ల కొంచెం అనారోగ్యానికి గురయ్యాడట.గత కొద్దిరోజుల క్రితమే ఆయనకీ విపరీతంగా జ్వరంకూడా రావడం తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని తెలుస్తుంది.

కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్తున్నా కానీ తనని నమ్మి నిర్మాత వేల కోట్లు ఖర్చుపెడుతున్నాడని వాళ్లకి ఎలాంటి నష్టం అయితే రాకూడదని షూటింగ్స్ కి అనారోగ్యం తోనే పాల్గొంటున్నాడటా ప్రభాస్.మరోపక్క అభిమానులు ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుందో అని తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు..సినిమాలు ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఆరోగ్యం జాగ్రత్త అన్నా అంటూ పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: