అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోయే సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారని వార్తలు కూడా వస్తున్నా కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో నటించిన మృణాల్ బాగా నటించింది.ఇలా ఎంతోమంది ఈమెకు అభిమానులుగా మారిపోవడంతో ఏకంగా ఈమెను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజల్స్ కూడా పెట్టేస్తున్నారని సమాచారం.ఈ క్రమంలోనే ఒక అభిమాని ఏకంగా ఈమెను నన్ను పెళ్లి చేసుకుంటావా నా సైడ్ నుంచి సంబంధం ఓకే అయింది మరి నీ సైడ్ నుంచి పెళ్లికి ఓకేనా అంటూ ఈమెను పెళ్లి గురించి ప్రశ్నిస్తూ తనకు పెళ్లి ప్రపోజ్ చేశారటా..
ఇలా అభిమాని తనకు ప్రపోజ్ చేయడంతో స్పందించిన మృణాల్ చాలా సున్నితంగా సమాధానం చెప్పారు. నా తరపు నుంచి వద్దు అనుకుంటున్నాను అంటూ ఈమె కామెంట్ కూడా చేశారు. ఇలా సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈమె చాలా సున్నితంగా సమాధానం చెప్పడంతో కొందరు ఈ కామెంట్ పై స్పందిస్తూ కామన్ మ్యాన్ కి దక్కే మహారాణి కాదు ఆమె అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారటా..ఏది ఏమైనా ఈమె యాడ్స్ మరియు బాలీవుడ్ సినిమాలలో నటించినప్పటికీ రాని గుర్తింపు తెలుగులో నటించిన సీతారామం సినిమా ద్వారా ఒక్కసారిగా బాగా పాపులర్ అయ్యారని చెప్పొచ్చు. ఈ అమ్మడు వరుస పెట్టి సినిమాలను చేస్తుంది. ఈ అమ్మడి క్రేజ్ బాగా పెరిగి పోయింది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు తెచ్చుకుంటుంది. సీత పాత్రలో ట్రేడిషనల్ కనిపించిన ఈమె గ్లామర్ రోల్స్ లో కూడా అదరగోడుతుంది.