అంతేకాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఉత్తరాదిలో కూడా భారీగానే ఫాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న నటుల అల్లు అర్జున్ కూడా ఒకరు. ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఎక్కువమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడుగా పేరుపొందారు. ఇప్పుడు తాజాగా 20 మిలియన్స్ మైలురాయిని సాధించిన మొదటి దక్షిణ భారతీయ నటుడుగా రికార్డు అందుకోవడం జరుగుతోంది. అల్లు అర్జున్ ఇటు సినిమాలకు ,అటు ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి విషయాలనైన తెలియజేస్తూ ఉంటారు.వృత్తి పరంగా వ్యక్తిగతంగా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు.
అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి పిల్లలు అయాన్ అర్హత ఉన్నటువంటి వీడియోలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటారు దీంతో అభిమానులు అల్లు అర్జున్ షేర్ చేసేటువంటి పోస్టింగ్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు కేవలం తన ఫోకస్ మొత్తం ఈ సినిమా పైన పెట్టినట్లు తెలుస్తోంది అందుచేతనే బాలీవుడ్లో జవాన్ చిత్రంలో గెస్ట్ రోల్ పాత్రలో వచ్చినా కూడా నటించలేదన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతొంది.