పెళ్లి సందడి సినిమా తర్వాత శ్రీలీల వరుసగా అవకాశాలు అందుకుంటుంది. స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా బిజీబిజీగా గడుపుతూ ఉంది. ఇక ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు 10 ప్రాజెక్టులు ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు మొన్నటికి మొన్న రవితేజతో జోడి కట్టి ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. అయితే ఇలా హిట్టు కొట్టిన తర్వాత ఏ హీరోయిన్ అయినా సరే రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటుంది.
కానీ పది సినిమాలు చేతిలో ఉన్న ఇంకా శ్రీలీలా రెమ్యూనరేషన్ తక్కువగానే ఉంది అన్నది తెలుస్తుంది. కేవలం ఒక్కో సినిమాకి కోటిన్నర రూపాయలు మాత్రమే తీసుకుంటుందట ఈ ముద్దుగుమ్మ. అయితే ఆమెకు ఇంత మొత్తం చెల్లించడం కూడా ఎక్కువైనని కొంత తగ్గించుకోవాలని నిర్మాతలు కోరినట్లు తెలుస్తోంది. ఇక శ్రీలీల మాత్రం పారితోషికం విషయంలో తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిందట. శ్రీలీల నటించిన మరో రెండు సినిమాలు హిట్ అయ్యాయి అంటే స్టార్ హీరోయిన్లకు దీటుగా ఈ అమ్మడి పారితోషకం కూడా మూడు నుంచి నాలుగు కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఒక్క సినిమా హిట్టుతోనే ఎంతో మంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ భారీగా పెంచుతుంటే.. శ్రీ లీలా మాత్రం పది సినిమాలు చేతిలో ఉన్న ఇంకా తక్కువ పారితోషకం తీసుకుంటుంది అన్నది మాత్రం తెలుస్తుంది.