![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/balaya-webseries53b6138b-72dd-4841-8b4a-bb857e52a309-415x250.jpg)
ముఖ్యంగా అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హోస్టుగా వచ్చిన తర్వాత బాలయ్యలో పలు మార్పులు కనిపిస్తున్నాయి. తనలోని విభిన్నమైన కోణాలను చూపిస్తూ ప్రేక్షకులను బాగా సందడి చేస్తూ ఉన్నారు. బాలయ్య తాజాగా మరొక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో డిజిటల్ మీడియా నుంచి ఆదరణ రావడంతో ఎంతో మంది సెలెబ్రేటట్లు సైతం ఆవైపుగా అడుగులు వేయడం జరిగింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ సైతం డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అహ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నారు.
దీంతో అల్లు అరవింద్ బాలయ్యతో ఒక వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అందుకు గాను బాలకృష్ణతో అల్లు అర్జున్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ బాలయ్య ఓకే అంటే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే విడుదలవుతాయి. ఇప్పటికే బాలకృష్ణ సమానమైనటువంటి వెంకటేష్ సైతం రామానాయుడు అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తో కూడా వెబ్ సిరీస్ చేయాలని ఆలోచనతో అల్లు అరవింద్ ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానులకు ఫుల్ ట్రీట్ అని చెప్పవచ్చు. బాలయ్య ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా షూటింగ్ జరుపుకోబోతున్నారు.