అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉందని అందరికి తెలుసు.ఎన్నో విమర్శలు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎన్టీఆర్ ఈ రేంజ్ కు ఎదిగారు.
కెరీర్ మొదటిలో ఎన్టీఆర్ కు ఎన్నో అవమానాలు అయితే ఎదురయ్యాయి.. హరికృష్ణ మినహా నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎవరి సపోర్ట్ కూడా లభించలేదు. ఆ తర్వాత కాలంలో పరిస్థితులు కొద్దిగా మారాయి. స్టూడెంట్ నంబర్1, ఆది మరియు సింహాద్రి సినిమాల విజయాల తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ కు కు సపోర్ట్ లభించిందనే విషయం తెలిసిందే. 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున కూడా ప్రచారం చేశారు.
ఆ సమయంలో యాక్సిడెంట్ అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రచారం విషయంలో అస్సలు వెనుకడుగు వేయలేదు. అయితే ఎన్టీఆర్ సపోర్ట్ వల్ల ఆ ఎన్నికల్లో టీడీపీ మెరుగైన ఫలితాలను కూడా నమోదు చేసింది. అయితే ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ కు అవమానాలు ఎదురవుతున్నట్టు కొన్ని ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఏ విషయం గురించి స్పందించినా కొందరు నేతలు కావాలని వివాదాస్పదం చేస్తున్నారని తెలుస్తుంది.
ఎన్టీఆర్ కు జరుగుతున్న అవమానాలు అభిమానులు దృష్టికి వస్తున్నా తమ ఫేవరెట్ హీరోను బాధ పెట్టడం ఇష్టం లేక మౌనం గా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ కు కష్టాలు వస్తే తాము అండగా ఉంటామని వాళ్లు చెబుతున్నారు. తమ హీరోను బాధ పెట్టవద్దని అభిమానులు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొప్పదనానికి అలాగే మంచితనాన్ని ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా మెచ్చుకుంటున్నారు.