అయితే ఈ సినిమా షూట్ ప్రెజెంట్ కొద్దిగా బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది.. ఎందుకంటే ఆస్కార్ ఈవెంట్ కోసం చరణ్ యూఎస్ వెళ్లడంతో ప్రస్తుతం షూట్ బ్రేక్ పడిందని తెలుస్తుంది.అయితే ఇప్పుడు చరణ్ పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.. బాలీవుడ్ లో ఆడియెన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఫ్యామిలీ సినిమా ''కిసీ కా భాయ్ కిసీ కా జాన్''..
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందటా.. ఈ సినిమాపై ఇప్పటికే బాలీవుడ్ లో మంచి అంచనాలు అయితే ఏర్పడ్డాయి.ఇక తాజాగా వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మరోసారి ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది.. ఈ సినిమాలో వెంకీ మామ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.. ఈయన పూజా హెగ్డే అన్న పాత్ర లో కనిపించ బోతున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా క్యామియో రోల్ చేయబోతున్నాడు అని సమాచారం.తాజాగా ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.. సల్మాన్ ఖాన్ కి చిరు ఫ్యామిలీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుండో ఉన్న విషయం తెలిసిందే.మరి ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ సినిమాలో చరణ్ కనిపించేందుకు ఓకే చెప్పారని కూడా తెలుస్తుంది.. అయితే ఈ సినిమాలో చరణ్ స్టోరీలో కాకుండా కేవలం సాంగ్ లో మాత్రమే కనిపించనున్నారని తెలుస్తుంది.. ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ కూడా చరణ్ అభిమాని అయిన జానీ మాస్టర్ కావడం గమనార్హం... మరి ఈ సాలిడ్ కాంబో ఏ విధంగా ఉంటుందో చూడాలి..