ఈ నెల 13న ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేడుక జరుగనుంది. ఈ సినిమా ఆస్కార్ గెలిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఆస్కార్ వేడుకలకు మూడు రోజుల ముందు మార్చి 10న తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను రీ రిలీజ్ కానుంది.
ఆస్కార్ క్రేజ్ దృష్టా రీ రిలీజ్లోనూ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఇటీవలే అమెరికాలో ఆర్ఆర్ఆర్ ను రీ రిలీజ్ చేశారు. ఫస్ట్ వీకెండ్లోనే దాదాపు రెండు కోట్లకుపైగా కలెక్షన్స్‌ను ఈ సినిమా రాబట్టింది. ఈ నేపథ్యంలో తెలుగు స్టేట్స్లో రీ రిలీజ్ కలెక్షన్స్ ఏ మేరకు ఉండొచ్చన్నది ఆసక్తికరంగా మారింది.
అస్కార్ అవార్డ్స్ ఈవెంట్లో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ పాల్గొననున్నారు. నాటు నాటు పాటకు ఎన్టీఆర్, చరణ్ లైవ్‌లో డ్యాన్స్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఈ పాటను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వేదికపై ఆలపించబోతున్నాడు.
1945 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించారు.
ఐతే దీని తర్వాత రాజమౌళి గారు మహేష్ బాబును హీరో గా చూపిస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి కూడా మనందరికీ తెల్సిందే. ఈ ఆస్కార్ పనులు కంప్లీట్ అయ్యాక మహేష్ -రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.