అయితే ఈ ఆస్కార్ అవార్డు రావడానికి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కృషి ఎంత ఉందొ, డైరెక్టర్ రాజమౌళి విజన్ ,కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన అద్భుతమైన స్టెప్స్, దానిని తెరమీద పోటీపడి మరీ వేసిన హీరోల డ్యాన్స్, ఇవన్నీ కలిస్తేనే ఆస్కార్ అవార్డు సాధ్యపడుంది.అయితే తెరవెనుక ఎంత మంది కష్టపడినా, తెర ముందు ఎవరైతే అద్భుతంగా ప్రెజెంట్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ మార్కులు పడుతుంది.ఆ క్రెడిట్ మాత్రం కచ్చితంగా ఎంతోకొంత హీరోలకు ఇవ్వాల్సిందే.
కానీ ఈ అవార్డు ని గెలుచుకున్న కీరవాణి స్టేజి మీద మాట్లాడుతున్న సమయం లో మూవీ టీం మొత్తానికి క్రెడిట్ ఇచ్చారు కానీ, ఈ సాంగ్ ప్రపంచం మొత్తం రీచ్ అయ్యేలా చేసిన హీరోల పేర్లు మాత్రం ప్రస్తావించకపోవడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది.ఆయన అద్భుతమైన కంపొజిషన్ వల్లే ఆస్కార్ అవార్డు దక్కింది, కానీ దానిని ఇంత మందికి రీచ్ అయ్యేలా చేసిన హీరోలకు కూడా సమానమైన క్రెడిట్ ఉంటుంది అనే భావన ప్రతీ ఒక్కరిలో ఉంది.ఆ ఒక్క ప్రస్తావన చేసి ఉంటే అభిమానులు ఎంతో సంతోషించేవారని విశ్లేషకుల అభిప్రాయం.కానీ ఏది ఏమైనా మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది.ప్రపంచం మొత్తం మారుమోగిపోయింది,అది చాలు అని అభిమానులు గర్వపడుతున్నారు.
ఇంకో విషయం ఏంటంటే ఒక్కోసారి స్టేజి పైన మనం భావొద్వేగానికి లోనైనపుడు కొన్ని విషయాలు మర్చిపోతాం అంతా మాత్రానికే మనం కావాలని చెప్పలేదు అని అనలేం. ఇది అవిధంగా జరిగిన తప్పిదమే కానీ కీరవాణి గారు కావాలని చేసింది కాదు అని అభిమానులు వాళ్లకు వాళ్లే సోషల్ మీడియా వేదికగా అనుకుంటున్నారు.