తన అందంతో వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ప్రముఖ నటి యమున. కర్ణాటకలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబంలో జన్మించిన ఆమె మౌన పోరాటం తో తెలుగు లోకి అడుగుపెట్టింది.

మామగారు, పుట్టింటి పట్టుచీర, ఎర్రమందారం, బంగారు కుటుంబం మరియు బ్రహ్మచారి మొగుడు తదితర లతో మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ మరియు మళయాళ భాషల్లో సుమారు 50కు పైగా ల్లో నటించింది. ఇక విధి, అన్వేషిత వంటి ధారావాహికలతో బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇలా నటిగా దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యమున 2011లో బెంగుళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిందనే వార్త అప్పట్లో సంచలనం గా మారింది.. అయితే ఈ వ్యవహారంలో యమున తప్పేమీ లేదంటూ ఆమెను కావాలనే ఇరికించారంటూ న్యాయస్థానంలో క్లీన్‌చీట్‌ కూడా లభించింది

దీని గురించి పలు సందర్భాల్లో, పలు వేదికల మీద కూడా చెప్పుఉకొచ్చింది. అయితే ఇప్పటికీ సోషల్‌ మీడియాలో తన మీద ఎన్నో అసభ్యకరమైన వార్తలు వస్తున్నాయంటోంది యమున. ఈ సంఘటనకు సంబంధించి చాలా దారుణమైన థంబ్‌నైల్స్‌తో మానసికంగా నన్ను హింసిస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను కూడా విడుదల చేసింది

'హాయ్ అండి.. నన్ను నేను ఎంత బలంగా వున్నా కూడా తెలియని ఓ బాధ అయితే నన్ను ఇప్పటికీ కూడా వెంటాడుతూనే ఉంది. అది కూడా ఇప్పుడు బాగా పెరిగి పోయిన సోషల్‌ మీడియా వల్ల. ఎందుకంటే నేను ఏళ్ల క్రితమే ఓ సమస్య నుంచి బయటకు వచ్చి ఎంతో ప్రశాంతంగా ఉంటున్నాను. ఆ ప్రాబ్లమ్‌లో నేను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందో ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో కూడా క్లారిటీగా చెప్పాను.ఆ విషయంలో న్యాయస్థానం కూడా నన్ను గెలిపించింది. న్యాయ పరంగా నేను విజయాన్ని సాధించాను. కానీ సోషల్ మీడియాను మాత్రం నేను అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పటికి కూడా నా గురించి, ఆ సంఘటన గురించి రకరకాల థంబ్‌నెయిల్స్‌, వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు.నేను వాటికి సంబంధించిన వీడియోలను అస్సలు చూడను. వాటిల్లో ఏం ఉందో నేను ఎప్పుడు కూడా చూడలేదు. కానీ ఆ థంబ్‌నెయిల్స్‌ మాత్రం నన్ను మానసికంగా చాలా భాధ పెడుతున్నాయి. ఎందుకంటే నేను కూడా మనిషినే కదా. ఏదో తెలియని బాధ నాకు కలుగుతుంది.

 ఆ థంబ్‌నెయిల్స్‌ చూస్తే.. నేను చనిపోయినా కూడా నన్ను వీళ్లు వదలరు కదా అనిపిస్తుంది' అని ఆవేదన వ్యక్తం చేసింది యమున. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. నెటిజన్లు ఆమెకు మద్దతునిస్తూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: