ఐతే ప్రెసెంట్ తమన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో తెలుగు సినిమాలలో నటించటం పూర్తిగా తగ్గించింది. f3 సినిమా తర్వాత ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. ఇదిలా ఉండగా కొంతకాలంగా బాలీవుడ్ నటుడుతో తమన్నా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఐతే గత కొంతకాలంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కొంతకాలంగా తమన్నా డేటింగ్లో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది గోవాలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ కనిపించడంతో వీరి రిలేషన్ గురించి వార్తలు మొదలయ్యాయి. అంతే కాకుండా ఆతర్వాత కూడా విజయ్ను ముద్దు పేరుతో పిలుస్తూ తమన్నా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయడంతో వీరి రిలేషన్ కి సంబందించిన వార్తలకు మరింత బలం చేకూరింది. ఈక్రమంలో విజయ్వర్మతో రిలేషన్షిప్ వార్తలపై స్పందించింది తమన్నా. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించి ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా విజయ్ తో రిలేషన్ గురించి వస్తున్న వార్తలపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యులో తమన్నా మాట్లాడుతూ ‘నేను, విజయ్ వర్మ కలిసి ఒక సినిమా చేశాం. అప్పటి నుంచి మా పై రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఐతే దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని అంటూనే ఆమె కొద్దిగా ఎమోషనల్ అయ్యారు.మాకు సామాన్య ప్రజనీకం నుంచి బిజినెస్మెన్ వరకూ ఇలా అందరితో మాకు పెళ్లిళ్లు చేసేస్తారు.నాకు నిజంగా పెళ్లెప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. అప్పటివరకూ వాళ్ళు ఇదే ఉత్సాహంతో ఉండగలరా? అప్పటికి మరోదాని గురించి ఆలోచిస్తుంటారేమో’ అంటూ తమన్నా సటైర్లు వేసింది.
ఐతే సోషల్ మీడియా వేదికగా తన పై వచ్చిన ఈ రకమైన కామంట్స్ కి తమన్నా బాగా ఎమోషనల్ ఐ దీని పైన ఘాటుగా స్పందించారు. ఇంకెప్పుడు ఇలా తెలియకుండా మాత్రం నేటిజన్లు అనొద్దని అన్నారు.