రాజమౌళి సినిమాల్లో ఒక్కసారైనా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. ఆయన కింద పనిచేస్తే ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయని నమ్మకం. అయితే దర్శక ధీరుడి యాక్టర్స సెలెక్షన్ భిన్నంగా ఉంటుంది. ఊహించని వారు తన సినిమాల్లో కనిపిస్తారు. ఈ క్రమంలో ఆయన సీనియర్ల కంటే కొత్తవారికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో సీనియర్ నటులను కూడా పాత్రలకు అనుగుణంగా తీసుకున్నారు. అవసరమైతే ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా నటులను ఎంపిక చేసుకుంటారు. కానీ చిత్ర పరిశ్రమలో ద బెస్ట్ యాక్టర్ గా పేరున్న ప్రకాష్ రాజ్ మాత్రం రాజమౌళికి చేసిన ఒకే ఒక్క సినిమా ఐనా విక్రమార్కుడు లో కనిపించారు.ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో డీజీపిగా కనిపించి ఆ తరువాత మాయమవుతారు. ఆ ఒక్క సినిమా తప్ప మరే సినిమాల్లో ప్రకాష్ రాజ్ కనిపించలేదు. అందుకు కారణమేంటని కొందరు రాజమౌళిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ఏ చెప్పారంటే 'ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు అన్ని పాత్రలు చేశారు. నా సినిమాల్లో ఆయనకు కొత్తగా ఇవ్వాల్సిన పాత్ర అంటూ ఏమీ లేదు. ఒకవేళ నేను అనుకున్న పాత్రలో ప్రకాష్ రాజ్ ను చూపించినా ప్రేక్షకులు బోర్ గా ఫీలవుతారు. అందువల్ల నా సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఎక్కువగా కనిపించరు' అని చెప్పాడట.
ఐతే కారణం ఇదేనా? లేక మరేదైనా ఉందా? అని కొందరు చర్చించుకుంటున్నారు. రాజమౌళి తలుచుకుంటే ప్రకాష్ రాజ్ కు ఎక్కువ నిడివి ఉన్న పాత్ర ఇవ్వడం పెద్ద విషయం కాదు. అలాగని రాజమౌళి రమ్మంటే వద్దని ప్రకాష్ రాజ్ అనరు. ఆయన తీసే విలన్ క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ ను చూపిస్తే జనాలు కచ్చితంగా ఆదరిస్తారు. మరి వీరిద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందోనన్న సస్పెన్స్ కలవరపెడుతోంది. ఇక ఇటీవల రాజమౌళి టీం ఆస్కార్ సంబరాల్లో మునిగితేలుతోంది. తెలుగు సినిమాను ప్రపంచ వేదికకు పరిచయం చేయడం ద్వారా ఆయనకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఐతే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తన సినిమాల్లో ఎటువంటి క్యారెక్టర్ లోనైనా తలకాయ ప్రవేశం చేసే ప్రకాష్ రాజ్ లాంటి వారికీ కూడా అవకాశలు ఇస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో కొంతమంది భావిస్తున్నారు.