నాచురల్ స్టార్ నాని , హీరోయిన్ కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న చిత్రం దసరా. ఈ సినిమా పైన వీరిద్దరికి చాలా నమ్మకంతో ఉన్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు టీజర్, ట్రైలర్ ఈ సినిమాకి బజ్ ఏర్పడేలా చేశాయి. ఈ సినిమాని డైరెక్టర్ శ్రీకాంత్ వదిన దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈనెల 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నైలో నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


నాని కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్న మొదటి చిత్రం దసరా. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాని చెన్నైలో దసరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించబోతున్నట్లు బజ్ వినిపిస్తోంది. ఇందుకు ముఖ్య అతిథిగా నటుడు ధనుష్ కూడా రాబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎందుకు సంబంధించి ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే వెలుబడలేదు.. కానీ ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది. అధికారికంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం.


నాని కెరియర్ లోనే ఈ సినిమాలో చాలా మాస్ హీరోగా కనిపించబోతున్నారు ఇంతవరకు నానిని చూడని యాంగిల్స్ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు ఈ సినిమా ట్రైలర్ను చూస్తే మనకి అర్థమవుతోంది. సరైన సక్సెస్ లేక నాని చాలా రోజుల నుంచి సతమతమవుతున్నారు మరి నానికి ఈ సినిమా సరైన ఊరటను ఇస్తుందేమో చూడాలి మరి. ఏదిఏమైనా అటు కీర్తి సురేష్ నాని కెరియర్ల ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: