కేజిఎఫ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాల తర్వాత కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అద్భుతమైన రీతిలో కథలు చెప్పడంలో నైపుణ్యం కలిగిన పరిశ్రమగా పేరుపొందింది కన్నడ సినీ పరిశ్రమ. కానీ కేజిఎఫ్-2 తర్వాత మరే సినిమా ఆ రేంజ్ లో రాలేకపోవడంతో మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోయింది కన్నడ సిని రంగం. కన్నడ స్టార్ హీరో దర్శన్ ఇటీవల హీరోగా నటించిన క్రాంతి సినిమా జనవరి 26న విడుదలై పలు భాషలలో డబ్ అయ్యి విడుదలయ్యింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.


ఇక విలక్షణమైన నటుడుగా పేరు పొందిన ఉపేంద్ర హీరోగా నటించిన కబ్జా చిత్రం ఈ రోజున పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో విడుదలయింది.ఇందులో హీరోయిన్గా శ్రీయ నటించింది శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలో నటించారు. అలాగే సందీప్ కిచ్చా కూడా కీలకమైన పాత్రలో నటించారు.  ఈ సినిమా పైన భారీ ఆశలు పెట్టుకున్నారు కన్నడ సినీ ప్రేక్షకులు.వారి ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యాయని తెలుస్తోంది పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.


కే జి ఎఫ్ తరహాలో ఉంటుందని చాలా మంది కామెంట్లు చేశారు ఇతర భాషల్లో కూడా కన్నడలో కూడా బుకింగ్స్ చాలా తక్కువగానే ఉన్నాయి మల్టీ స్టారర్ గా అంచనా వేసినప్పటికీ ఎవరిలోనూ అంత ఇంట్రెస్ట్ కనిపించలేకపోతోంది. ఇక యూఎస్ఏ లో కూడా ప్రీమియం షోలు గందరగోళానికి గురయ్యాయి ఇండియాలో మొదటి షో ప్రారంభం అయ్యే సమయానికి యూఎస్ఏ లో ప్రారంభమయ్యాయి అమెరికాలో సినిమా ఎలాంటి నెగిటివ్ టాక్ రాకూడదని ఉద్దేశంతో చిత్ర బృందం  నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముంబైలో కొంతమంది ముందస్తుగానే హిందీ వర్షన్ రివ్యూలు ఇవ్వడం జరిగింది అయితే ఇవి పాజిటివ్గా లేవు.. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: