కన్నడ బ్యూటీ రష్మిక మందన్న చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. సౌత్ లో వరుస అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ గత ఏడాది కాంతారా సినిమా వివాదం కారణంగా తన ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసుకుంది. తన సొంత గడ్డ అయినా కన్నడలోనే రష్మిక పై తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. అది ఎంతలా అంటే కన్నడ ఇండస్ట్రీ వాళ్ళే ఈమెను బ్యాన్ చేయాలని నానా రచ్చ చేశారు. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం రష్మిక మందన ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కి జోడిగా పుష్ప2 సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్లో రణబీర్ కపూర్ సరసన యానిమల్ అనే సినిమా చేస్తోంది. 

అయితే ఈ సినిమాలను కాంతర వివాదానికి ముందే ఒప్పుకుంది రష్మిక. కానీ కాంతారా వివాదం తర్వాత ఈ బ్యూటీ ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. ఈ ఏడాది స్టార్టింగ్ లో వారసుడు సినిమాతో డీసెంట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.హిట్ వచ్చినా కూడా ఇప్పుడు ఆమెపై ఎవరు ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది వరకు చేతినిండా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు పూర్తిగా ఖాళీగా మారిపోయింది. దీంతో పాపం అవకాశాలు లేక ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలోని రష్మిక త్వరలోనే ఓ మరాఠీ టీవీ షో ద్వారా ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఈ మరాటి షో మార్చి 6 న ప్రసారం కానుంది.

ఇక ఈ షోలో రష్మిక మరాఠీ కి చెందిన లవణీ అనే సాంప్రదాయ జానపద నృత్యాన్ని కనబరిచింది. దీంతో రష్మిక  డాన్స్ చేస్తున్న ఓ వీడియోను టీవీ షో నిర్వాహకులు రిలీజ్ చేశారు.' మా షోలో రష్మిక మందన పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. అచ్చమైన మరాటి అమ్మాయి వస్త్రాదరణలో రష్మిక మందన మహారాష్ట్రయుల హృదయాన్ని గెలుచుకుంది' అంటూ షో నిర్వాహకులు రష్మిక మందనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి సినిమా ఆఫర్లు లేక చివరకు రష్మిక బుల్లితెరపై నటించేందుకు సైతం సిద్ధమవడం ఇప్పుడు గమనార్హంగా మారింది. మరి వెండితెరపై అలరించిన రష్మికమందున్న..ఇప్పుడు బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ను అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: