టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుపొందిన మహేష్ బాబు తన తండ్రి కృష్ణకు తగ్గట్టుగానే సినిమాలలో నటిస్తు మంచి పాపులారిటీ సంపాదించారు. ఎక్కువగా మెసేజ్ ఓరియంటే చిత్రాలలో నటించే మహేష్ బాబు ఈసారి అలాంటి వాటికి భిన్నంగా నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న SSMB -28 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్లుగా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నది. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆలస్యం అవుతూ వస్తోంది.


అయితే ఈ సినిమాని ఆగస్ట్ నెలలో విడుదల చేస్తారని చిత్ర బృందం ఇది వరకే ప్రకటించడం జరిగింది.. ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీపై కూడా మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా దీపావళికి లేకపోతే దీపావళి తర్వాత విడుదల అయ్యేందుకు ఎక్కువగా ఆస్కారం ఉన్నట్లు సమాచారం. అయితే అందుకు గల కారణం ఏంటనే విషయం ఇంకా తెలియడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాలలోని జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మహేష్ బాబు, పూజ హెగ్డే కలయికలో వస్తున్న రెండవ చిత్రం ఇది. ఇక త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా ఇది. ఈ సినిమా పైన అభిమానులకు భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా అయిపోయిన వెంటనే దర్శక ధీరుడు రాజమౌళితో తన 29వ సినిమా అని చేయబోతున్నారు మహేష్ బాబు. ఈ సినిమా కూడా ఫ్యాన్ వరల్డ్గా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి SSMB -28 పోస్ట్ పోన్ పై వస్తున్న వార్తలపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: