ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ చాలా పెరిగిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు అనేకం రూపొందుతున్నాయి ... అలాగే రూపొందాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి భారీ బడ్జెట్ తో రూపొందిన మరియు రూపొందుతున్న టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ... సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో ఒక మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.


మూవీ మహేష్ కెరియర్ లో 29 వ మూవీ గా రూపొందిపోతుంది. ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కోసం బడ్జెట్ ను కూడా అదే రేంజ్ లో ఈ మూవీ నిర్మాతలు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో రూపొందించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే మూవీ కోసం అత్యధిక బడ్జెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం చిత్ర బృందం 600 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.

మూవీ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆది పురుష్ మూవీ కోసం ఎక్కువ బడ్జెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఈ మూవీ మేకర్స్ 550 కోట్ల బడ్జెట్ వరకు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గా రుపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం ఈ మూవీ నిర్మాత డి  వి వి దానయ్య 550 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఇప్పటికే విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రూల్ మూవీ కోసం ఈ మూవీ నిర్మాతలు 400 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: