పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పుష్ప సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమా భారీ రెస్పాన్స్ లభించింది. స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా మారిపోయారు. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. విడుదలైన మొదటి రోజు నెగటివ్ టాకు వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా పాజిటివ్గా దూసుకుపోయింది. దీంతో పుష్ప సినిమా సీక్వెల్ పైన ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయని చెప్పవచ్చు..


సినిమా అప్డేట్ కోసం గత కొద్ది రోజుల నుంచి పలువురు అభిమానులు ర్యాలీలు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం గురించి ఒక అప్డేట్ బయటకు రావడం జరిగింది. పుష్ప-2 సినిమా గురించి ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8వ తేదీన ఒక అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నట్లు డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోని ఈ సినిమా ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణల నుండి మూడు నిమిషాల నిడివి కలిగిన యాక్షన్ టీజర్ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.


ఇప్పటికే టీజర్ కట్ పూర్తయిందని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు దేవిశ్రీప్రసాద్ కూడా సంగీతం అందించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ బర్తడే కానుకగా రిలీజ్ కాబోయే ఈ టీజర్ యాక్షన్ షాట్స్ ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సాయి పల్లవి నటించబోతున్నట్లు గతంలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఈ విషయం పైన స్పందించలేదు. ఏది ఏమైనా ఇన్ని రోజులకు అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: