టాలీవుడ్ కోలీవుడ్ లో నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన అనుష్క కొత్త హీరోయిన్ల రాకతో పూర్తిగా వెనకబడిపోయింది. ఇక చాలా కాలం తరువాత ఆమె చేస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ మూవీలో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతోంది.రీసెంట్ గానే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇంకా అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో వీరిద్దరి లుక్స్ అయితే చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. అనుష్క కెరీర్ లో 48వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని ప్రభాస్ సన్నిహితులు వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా ఇంకా రథన్ సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 


పెళ్లి తర్వాత అమ్మాయి లైఫ్ లో ఉన్న కష్టాలని చెబుతూ ఈ సాంగ్ విడుదల అయ్యింది.అవుట్ అండ్ అవుట్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.అయితే ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇక అనుష్క వెండితెరపై కనిపించి దాదాపు రెండున్నరేళ్లు దాటింది. ఆమె చివరగా కనిపించిన మూవీ నిశ్సబ్దం. 2020 అక్టోబర్ 2 వ తేదీన నేరుగా ఓటీటీలో విడుదలైంది ఈ సినిమా. మిస్టరీ జానర్ లో వచ్చిన ఈ మూవీలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటించి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాతో అనుష్క మళ్ళీ తన మునుపటి ఫామ్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: