టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ అమ్మడు గురించి చర్చించుకుంటున్నారు. కొంతమంది ఈ అమ్మడు అందం అభినయం గురించి చర్చించుకుంటుంటే.. మరి కొంతమంది ఈ హీరోయిన్ చేసే డాన్స్ పర్ఫామెన్స్ ల గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పాలి. పెళ్లి సందడి అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన శ్రీ లీల తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది అని చెప్పాలి.



 ఇక  ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇక ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాలో ఛాన్సులు కొట్టేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది అని చెప్పాలి. బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య కూతురుగా నటిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బాలయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి ఇటీవలే మాట్లాడింది శ్రీ లీల. ఈ క్రమంలోనే శ్రీలీలా ఒక్క మాటతో బాలయ్య అభిమానులు అందరినీ కూడా తన వైపుకు తిప్పుకుంది అని చెప్పాలి.


ఇంతకీ శ్రీ లీల ఏం చెప్పిందంటే.. నాకు ఎప్పుడు జనాల మధ్య ఉండడం ఇష్టం.. అదృష్టవశాత్తు నేను ఈ రంగంలోకి వచ్చాను. అయితే నేను మొదటి నుంచి నందమూరి బాలకృష్ణ కు వీరాభిమాని. ఇక ఆయనతో కలిసి నటించడం మొదలుపెట్టాక ఇంకా పెద్ద అభిమానిగా మారిపోయా.. ఆయనది అంత గొప్ప వ్యక్తిత్వం.. ఆయనతో కలిసి స్క్రీన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. డైలాగ్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకుండా అప్రమత్తంగా ఉంటా.. అందరూ బాలయ్య సినిమాలో నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. కానీ క్యారెక్టర్ గురించి తెలుసాక ఆశ్చర్యపోతారు అంటూ శ్రీలీల చెప్పింది. అయితే బాలయ్య కు వీరాభిమాని అంటూ శ్రీ లీలా చెప్పడం.. ఇక ఆయన వ్యక్తిత్వాన్ని పొగడడంతో బాలయ్య అభిమానులు ఇక ప్రతి సినిమాలో శ్రీలీలను ఎంకరేజ్ చేయడానికి సిద్ధమైపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: