టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛలో సినిమా ద్వారా మొదట తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పెరు సంపాదించింది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె పుష్ప చిత్రంతో ఏకంగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఆ క్రేజ్ తో ఈమే ఇతర భాషలలో కూడా పలు సినిమాలలో నటించి తన హవా కొనసాగిస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా హీరోయిన్లకు దీటుగా పలు సినిమాలలో నటిస్తోంది.


కానీ ఎప్పుడూ ఏదో ఒక విధంగా ట్రోల్ కి గురవుతూనే ఉంటుంది రష్మిక. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.కానీ ఈ విషయంపై ఇప్పటికి క్లారిటీ ఇవ్వలేదు. ఎంతమంది హీరోయిన్ల సైతం పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు వీటి ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నారు అలా రష్మిక ఇప్పటివరకు జువెలరీ, వస్త్రధారణకు సంబంధించి పలు యాప్స్ కు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటోంది.


అయితే ఇప్పుడు తాజాగా 7up బ్రాండ్ కి కూడా అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే..అలాగే వీటితో పాటు స్ప్రైట్(Sprite) కోసం మరొకసారి బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదురుచుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మొదటిసారి ఈమె రెండు వ్యతిరేక పక్షాలను ఆమోదించబోతోంది అంటూ రష్మిక పైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా గతంలో కూడా ఎన్నో రకాలుగా గురైన రష్మిక ఇప్పుడు తాజాగా వీటి గురించి మరొకసారి ట్రోల్ కు గురవుతోంది. డబ్బు కోసం ఇలాంటి పనిచేస్తున్న రష్మి కాను చూసి పలువురు నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: