ప్రస్తుతం విజయ్ లియో సినిమా మీద విజయ్ అభిమానులు విజయ్ కూడా చాలా నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో విజయ్ పరుగులు పెడుతూ ఆర్మీ జవాన్లతో మాట్లాడుతున్న విజువల్స్ వీడియోను మేకర్స్ విడుదల చేయడం జరిగింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .దళపతి విజయ్ 67వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇందులో త్రిష ఫిమేల్ లీడ్ రోల్ నటిస్తోంది. లియో చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, అర్జున్, ప్రియ ఆనంద్ ,గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న లోకేష్ కనకరాజు తోపాటు రత్నకుమార్ ధీరజ్ వైడి డైలాగులను అందిస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే విజయ్ ,లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన మాస్టారు చిత్రం ఎంత విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ విజయం కారణంగానే లియో సినిమా పైన భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం ఒక వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది.