
వారి కాంబినేషన్ లో వస్తున్న ఈమూవీకి అన్నివిధాల ఆగష్టు 11 రిలీజ్ డేట్ బాగుంటుందని లాంగ్ వీకెండ్ సెలవులు వస్తూ ఉండటంతో భారీ కలక్షన్స్ ను టార్గెట్ చేయవచ్చని మహేష్ త్రివిక్రమ్ లు ఊహించుకున్నారు. దానికి తగ్గట్టుగానే తమ లేటెస్ట్ మూవీ షూటింగ్ ను పరుగులు తీస్తూ ఈమూవీ షూటింగ్ ను జూన్ నెలాఖరుకి పూర్తి చేయాలని మాష్టర్ ప్లాన్ వేసుకున్నారు.
అయితే ఇప్పుడు ఆగష్టు 11న ‘భోళాశంకర్’ మూవీ రిలీజ్ పక్కా అవ్వడంతో చిరంజీవితో పోటీ పడే సాహసం మహేష్ చేయడు. దీనితో తమ సినిమాకు మరో రిలీజ్ డేట్ వెతికే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ ఆలోచనలలో అక్టోబర్ 28 దసరా టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్ ఉన్నప్పటికీ ఆ రిలీజ్ డేట్ పట్ల మహేష్ కు ఏమాత్రం ఇష్టం లేదు అంటున్నారు. గతంలో దసరా టార్గెట్ చేస్తూ విడుదలైన ‘ఖలేజా’ ‘బాబి’ ‘అతిధి’ ‘వంశీ’ సినిమాలు అన్నీ గతంలో దసరా ను టార్గెట్ చేస్తూ విడుదలై ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో మళ్ళీ అలాంటి ప్రమోగం చేయకూడదని మహేష్ త్రివిక్రమ్ కు సూచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీనితో తమ మూవీని రాబోయే సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటే ఆ సంక్రాంతికి ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రామ్ చరణ్ శంకర్ ల మూవీలు ఉండటంతో అన్ని భారీ సినిమాల మధ్య తమ సినిమా విడుదల కావడం ఏమాత్రం మంచిది కాదని భావిస్తూ వీరిద్దరూ తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్..