టాలీవుడ్ లో ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నారు నరేష్ - పవిత్ర లోకేష్.. వీరిద్దరూ గత ఏడాది సహజీవనం చేస్తున్నారనే విషయం వైరల్ కావడంతో వీరిద్దరి పేర్లు ఇండస్ట్రీలో మారుమ్రోగుతూనే ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం నరేష్ తన ట్విట్టర్ నుంచి పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకున్నట్లుగా ఒక వీడియోని షేర్ చేయడంతో మరోసారి వైరల్ గా మారారు. అయితే వీరిద్దరూ నిజంగానే వివాహం చేసుకున్నారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఈ రోజున ఆ విషయంపై క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది.


ఈ ఏడాది మొదట్లో లిప్ లాక్  చేసుకుంటూ ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. అయితే ఇదంతా కేవలం పెళ్లి కోసం కాదంటూ ఒక సినిమా కోసం అంటూ తెలుస్తోంది. ఆ సినిమా పేరే మళ్లీ పెళ్లి.. నరేష్ పవిత్ర ఇద్దరూ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని నరేష్ తల్లి విజయనిర్మల స్థాపించిన విజయకృష్ణ బ్యానర్ పైన నిర్మించడం జరుగుతోంది. ఈ సినిమాకి దర్శకత్వం ఎమ్మెస్ రాజు వ్యవహరిస్తున్నారు.

నరేష్ సినీ పరిశ్రమలు అడుగుపెట్టి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ సినిమాని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీర్చిదిద్దబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అందుకు సంబంధించి మళ్లీ పెళ్లి అనే ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో నరేష్ వైట్ కలర్ దుస్తులు ధరించి చేతికి స్మార్ట్ వాచ్ ధరించి పవిత్ర వాకిట్లో వేస్తున్నటువంటి ముగ్గు దగ్గర ఉండి అలా చూస్తున్నారు. వీరిద్దరూ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా ట్రెండీగా కనిపిస్తున్నారని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.  విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం తెలుగు , కన్నడ వంటి భాషలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీంతో నరేష్ ,పవిత్ర పెళ్లి సినిమాలోది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: