టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరియర్లో 28వ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాలో మహేష్ సరి కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాని తనదైన స్టైల్ లో తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరొకసారి బ్లాక్ బాస్టర్ హిట్టుని అందుకోవడం ఖాయమని అభిమానులు ధీమాని వ్యక్తం చేస్తున్నారు.


ఈ సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్లో అతి త్వరలో పూర్తి చేయాలని భావిస్తోంది .కానీ ఇప్పుడు ఈ సినిమాని ఆగస్టులో కాకుండా దీపావళికి లేకపోతే క్రిస్మస్ లేకపోతే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే త్రివిక్రమ్ మాత్రమే సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరా బరిలోని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.


ఈ సినిమాను కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథతో తెరకేక్కిస్తూన్నట్లు తెలుస్తోంది.ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే, శ్రిలీల నటిస్తూ ఉన్నారు. సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉండడం జరుగుతోంది. ఏదేమైనా ఈ సినిమా అప్డేట్ పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తోందా లేదా చూడాలి మరి. ఈ సినిమా అయిపోయిన వెంటనే దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన తదుపరి సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా ఫ్యాన్ వరల్డ్ గా తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: