‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ హిట్ అయినప్పటికీ అఖిల్ కోరుకున్న బ్లాక్ బష్టర్ హిట్ ను ఆమూవీ ఇవ్వలేకపోయింది. దీనితో ఈ యంగ్ హీరో సురేంద్ర రెడ్డిని నమ్ముకుని మొదలుపెట్టిన ‘ఏజెంట్’ ఎట్టకేలకు వచ్చేనెల 28వ తారీఖున విడుదల కాబోతోంది. ఈమూవీ కోసం అఖిల్ మార్కెట్ ను కూడ లెక్కచేయకుండా అత్యంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టడంతో ఆ రేంజ్ లో అఖిల్ మూవీకి కలక్షన్స్ వస్తాయా అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి.


ఈమూవీని భారీ స్థాయిలో ప్రమోట్ చేసి అఖిల్ కోరుకున్న బ్లాక్ బష్టర్ హిట్ ఇవ్వాలని దర్శకుడు సురేంద్ర రెడ్డి చాల భారీ ప్లాన్స్ వేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈమూవీతో అఖిల్ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. ఈమూవీ ప్రమోషన్ లో భాగంగా జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు.


ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లను అతిధులుగా పిలవడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ రామ్ చరణ్ తో చాల సన్నిహితంగా ఉంటాడు. వారిద్దరికీ ఖాళీ సమయం దొరికినప్పుడు అఖిల్ చరణ్ దక్కరకు వెళ్ళి అక్కడ చిరంజీవి ఇంటి బిడ్డలా కలిసిపోతూ ఉంటాడని స్వయంగా చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.


ఆ సాన్నిహిత్యం రీత్యా అఖిల్ స్వయంగా రంగంలోకి దిగి రామ్ చరణ్ ను తన మూవీ ఫంక్షన్ కు పిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దర్శకుడు సురేంద్ర రెడ్డికి జూనియర్ తో చాలామంచి సాన్నిహిత్యం ఉంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు కూడ వచ్చాయి. ఆ రెండు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ సురేంద్ర రెడ్డి అంటే జూనియర్ కు చాల అభిమానం అని కూడ అంటారు. ఆ అభిమానంతోనే జూనియర్ కూడ ‘ఏజెంట్’ ఫంక్షన్ కు వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. అదే జరిగితే అఖిల్ ను ప్రమోట్ చేసే బాధ్యత జూనియర్ చరణ్ లు తీసుకున్నట్లు అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: